VIDEO: యూరియా కోసం క్యూ లైన్ కట్టిన రైతులు

WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. నల్లబెల్లి గ్రామంతోపాటు చంద్రు తండ, రందాన్ తండా గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం తరలివచ్చారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తాల యూరియాను సిబ్బంది అందించారు. కానీ తమకు సరిపడ యూరియా ఇవ్వడం లేదని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.