బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లు సీజ్
నెల్లూరులో మరోసారి బెట్టింగ్ ముఠా పట్టుబడింది. బుచ్చికి చెందిన మహేశ్ బాబు, హరికృష్ణ దుబాయ్ ట్రైనింగ్‌తో 'Radhee Exchange App' బెట్టింగ్ దందా నడుపుతున్నారు. నిందితులను బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.34.65 లక్షల నగదు, బ్యాంకుల్లోని రూ.1.64 కోట్లతో పాటు 13 సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.