రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని DRMకు వినతి
MNCL: మందమర్రి రైల్వే స్టేషన్‌లో సింగరేణి, రామగిరి ప్యాసింజర్, కాగజ్నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హల్టింగ్ హాల్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు కోరారు. ఈ మేరకు మందమరి రైల్వేస్టేషన్‌లో సందర్శించిన DRM గోపాలకృష్ణను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా నార్లాపూర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు.