పిడుగుపాటుతో.. పాడిగేదె మృతి

MHBD: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలోని జయరాం తండాలో గురువారం రాత్రి పిడుగు పడిన ఘటనలో బాలుకు చెందిన పాడిగేదె మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.80 వేలని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబం ఆర్థికంగా నష్టపోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.