‘90% గ్యాస్ దిగుమతులు ఆ జలసంధి నుంచే’
భారతదేశ LPG అవసరాల్లో 60% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో 90% దిగుమతులు వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతున్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 8న జారీ చేసిన ఉత్తర్వులతో ఉత్పత్తిని గరిష్ఠం చేసి కొరత లేకుండా చూడాలని కోరింది.