స్మార్ట్ ఫోన్లను అందజేసిన కలెక్టర్
HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 117 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ సుధారాణి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆరోగ్య భద్రత, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళుతుందన్నారు.