'ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి'

'ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి'

శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ నిషేధం-క్లాత్ బ్యాగుల వినియోగంపై మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, అన్న క్యాంటీన్ సీఈవో వంశీ పాల్గొని ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే హానులను వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.