రోడ్డు మీద పార్కింగ్.. ట్రాఫిక్‌కి అంతరాయం

రోడ్డు మీద పార్కింగ్.. ట్రాఫిక్‌కి అంతరాయం

GNTR: తెనాలి బోసురోడ్డు–దేవిచౌక్ మార్గంలో వాహనాలను రోడ్డు మీదనే పార్క్ చేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ స్కూల్‌ బస్సులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు పక్కగా నిలిపేయడంతో తరచూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి. సోమవారం సాయంత్రం పలుమార్లు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొన్నారు.