'రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి'

'రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి'

BDK: అశ్వాపురం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని స్థానికులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విస్తరణ పనులకు గాను నాలుగు కోట్ల రూపాయలు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మంజూరు చేయించారని తెలిపారు. పనులు పూర్తికాక పోవడంతో ఎండ వచ్చినప్పుడు దుమ్ము ధూళి, వర్షం వచ్చినప్పుడు బురదమయంగా మారుతుందని పేర్కొన్నారు.