రైతుల్ని ఇబ్బంది పెడితే క్రిమిన‌ల్ కేసులు: క‌లెక్ట‌ర్‌

రైతుల్ని ఇబ్బంది పెడితే క్రిమిన‌ల్ కేసులు: క‌లెక్ట‌ర్‌

NLR: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సంబంధిత రైస్ మిల్లర్ల‌పై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క‌లెక్ట‌ర్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనన్నారు.