రేపు వనపర్తి డిపోలో 'డయల్ యువర్ డీఎం'

రేపు వనపర్తి డిపోలో 'డయల్ యువర్ డీఎం'

వనపర్తి ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి బుధవారం 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సూచనలను 9959226289 నంబర్‌కు ఫోన్ చేసి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్‌కు వివరించవచ్చు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.