నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలు సీజ్: ఎస్సై

నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలు సీజ్: ఎస్సై

KNR: నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 30 వాహనాలను కేశవపట్నం పోలీసులు గురువారం సాయంత్రం సీజ్ చేశారు. కేశవపట్నం ఎస్సై రవి ఆదేశాలతో ట్రైనీ ఎస్సై సుమన్ రెడ్డి, సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సుమన్ రెడ్డి మాట్లాడుతూ.. వాహనాలకు సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి సీజ్ చేస్తామన్నారు.