సౌదీకి ఏపీ గవర్నర్ అత్యున్నత స్థాయి బృందం
AP: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ బృందం మృతిచెందిన బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించింది.