చెరువులో మృతదేహం లభ్యం

చెరువులో మృతదేహం లభ్యం

SRD: సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో గురువారం మృతదేహం లభ్యమైనట్లు సీఐ రాము నాయుడు తెలిపారు. మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. అతని ఒంటిపై చాక్లెట్ కలర్ డ్రాయర్ మాత్రమే ఉందని చెప్పారు. శవాన్ని మార్చూరులో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.