'ఎరువులు పక్కదారి పట్టిస్తున్నారు'

మన్యం: వీరఘట్టం మండలంలో ఎరువులను రైతులుకి అందించకుండా కూటమి నాయకులు పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్‌కు ఫిర్యాదు చేశారు. రైతులు ఎరువుల కోసం తిరుగుతుంటే అక్కడి వ్యవసాయ సిబ్బంది కూటమి నాయకులకు మాత్రమే ఎరువులు అందిస్తున్నారని ఆరోపించారు. ఇందులో వీరఘట్టం, పాలకొండ మండలాల నుంచి రైతులు పాల్గొన్నారు