‘పటేల్ నిజమైన సెక్యులర్.. నెహ్రూను అడ్డుకున్నారు’
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజమైన లౌకికవాది అని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. బాబ్రీ మసీదును ప్రభుత్వ నిధులతో కట్టాలని నెహ్రూ అనుకుంటే.. పటేల్ గట్టిగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. సోమనాథ్ ఆలయాన్ని ప్రజల విరాళాలతోనే కట్టాం తప్ప, ప్రభుత్వ సొమ్ము ఒక్క పైసా వాడలేదని పటేల్ ఆనాడే స్పష్టం చేశారన్నారు. అయోధ్య రామమందిరం కూడా ప్రజల సొమ్ముతోనే నిర్మితమైందని చెప్పారు.