'వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలి'
KMM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పనిచేసే వారికి పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పోలింగ్ కోసం ఉపయోగిస్తున్న కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు నిర్ణీత తేదీలతో పాటు ముందురోజు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.