ప్రభుత్వ పాఠశాల క్రీడాకారులకు GOOD NEWS
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు కలిపి రూ.15 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. క్రీడా సామాగ్రి కొనుగోలు కోసం ఇప్పటికే నిధులు విడుదల చేయగా, అవసరమైన సామగ్రి అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.