VIDEO: వేసవిలోనూ నిండుకుండలా చెరువు
GDWL: ధరూర్ మండలం చిన్నచింతరేవులలో వేసవిలోనూ నిండుకుండలా చెరువు కళకళలాడుతోంది. మార్చి, ఏప్రిల్ ఎండలకు సాధారణంగా చెరువులు అడుగంటిపోతుంటే, ఇక్కడ మాత్రం గత వర్షాలు, సమృద్ధిగా ఉన్న భూగర్భ జలాల కారణంగా నీటి నిల్వలు తగ్గలేదు. భానుడి భగభగల్లోనూ జలకళతో కనిపిస్తున్న ఈ చెరువును చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.