మోదీ, అమిత్ షాపై నూపుర్ శర్మ కీలక వ్యాఖ్యలు

మోదీ, అమిత్ షాపై నూపుర్ శర్మ కీలక వ్యాఖ్యలు

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ నాలుగేళ్ల తర్వాత బహిరంగంగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ మహిళా సమ్మేళనంలో మాట్లాడుతూ.. తన స్వేచ్ఛను కోల్పోయి 4 ఏళ్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ప్రాణాలతో, క్షేమంగా ఉన్నానంటే దానికి కారణం మోదీ, అమిత్ షా అని కొనియాడారు. వారు లేకపోతే తాను, తన కుటుంబం ఈరోజు ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని ఆమె పేర్కొన్నారు.