నేడు సాతాపూర్‌లో మంత్రి జూపల్లి పర్యటన

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్ గ్రామానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం మధ్యాహ్నం 3:30 రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ, రేషన్ కార్డుల అందజేత, విద్యుత్ సబ్‌స్టేషన్ శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.