గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు మూడేళ్ల జైలు
VZM: ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో 2018లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. డుంబ్రిగూడకు చెందిన కిముడు జయరాం, సబ్బవరం మండలానికి చెందిన దత్తి ప్రవీణ్ 3.7 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు.