బాధితులకు సీఎం సహాయనిధి అందజేత
VSP: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. శనివారం విశాఖలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద నలుగురు లబ్ధిదారులకు రూ.4,59,394 విలువైన చెక్కులను అందజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.