ఒకే చోట క్రికెట్, ఫుట్‌బాల్ దిగ్గజాలు
వాంఖడే స్టేడియంలో దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ సందడి చేశాడు. ఆయనతో పాటు డిపాల్, సువారెజ్ కూడా స్టేడియానికి విచ్చేశారు. భారత్ మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఛెత్రీకి మెస్సీ తన జెర్సీని అందజేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొని తన జెర్సీని మెస్సీకి అందించాడు.