ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ చీఫ్
TG: నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచందర్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా చిట్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొంథా తుఫాన్ వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు నష్ట పరిహారం అందేలా చూడాలని కోరారు.