కాకినాడ సిటీ రూరల్ ప్రాంతంలో పోలీసుల డ్రోన్ నిఘా
కాకినాడ సిటీ, రూరల్ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు శనివారం డ్రోన్ నిఘాతో పర్యవేక్షణ చేపట్టారు. మెయిన్ రోడ్, సినిమా స్ట్రీట్, వనసపాకల వంటి ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి అపశ్రుతులు జరగకుండా, అనుమానితులను అదుపులో తీసుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.