VIDEO: ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
PLD: నరసరావుపేటలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ తన కార్యాలయంలో సోమవారం సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం పేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగాయి.