సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
JGL: మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన రూ. 7,85,000 విలువైన 27 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుకు కృషి చేసి తమను ఆదుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.