MGMలో స్పెషల్ సదరం క్యాంపులు: కలెక్టర్

MGMలో స్పెషల్ సదరం క్యాంపులు: కలెక్టర్

వరంగల్ MGM ఆసుపత్రిలో ఈనెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్పెషల్ సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన వారు మీసేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ చేసినవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.