'అత్యవసరమైతేనే బయటకు రావాలి'

MDK: జిల్లాలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం సాయంత్రం ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ.. జిల్లాలో గడచిన 24 గంటల్లో భారీ అతి భారీ వర్షాలు కురిసినట్లు తెలిపారు. రానున్న 48 గంటల్లో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు బయటకు రావద్దని సూచించారు.