'పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి'

'పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి'

BDK: లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక పదో తరగతి విద్యార్థి అప్పం నితీష్(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసందే. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.