VIDEO: పీడీఎస్యు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి
KMM: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. హాస్టల్స్, గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు.