వృద్ధురాలి దారుణ హత్య.. బంగారం దోపిడీ

వృద్ధురాలి దారుణ హత్య.. బంగారం దోపిడీ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 28వ వార్డులో వృద్ధురాలి దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఆమెను హతమార్చి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న ఎస్సైలు ఐలయ్య, ఏడుకొండలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.