VIDEO: బస్‌స్టేషన్ నిర్మానుష్యం.. ప్రయాణికులకు ఇబ్బందులు
JN: ఆర్టీసీ జేఏసీతో చర్చలు విఫలమవడంతో బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపు ఇవ్వబడింది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనగాం పట్టణంలోని బస్ స్టేషన్ పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రత్యామ్నాయం లేక అధిక చార్జీలు చెల్లించి ఆటోలు ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.