VIDEO: కైకలూరులో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు
ELR: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' పత్రాలను కైకలూరు పార్టీ కార్యాలయం నుంచి ఏలూరు జిల్లా కార్యాలయానికి ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం భారీ ర్యాలీగా తరలించారు. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు యత్నించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు.