యూరియా అడిగితే అరెస్టులా ?: గేదెల పురుషోత్తం
శ్రీకాకుళం: యూరియా కావాలని అధికారులను అడిగితే లేదు పొమ్మంటున్నారని, ఇదేమిటని ప్రశ్నించేందుకు చూస్తే కలెక్టర్‌ను కూడా కలిసే అవకాశం ఇవ్వడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం మండిపడ్డారు. తెల్లారితే చాలు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రకటనలతో ఊదరగొడుతున్నారని విమర్శించారు.