మృతుడు తిరుపతి వాసిగా గుర్తింపు
TPT: రామచంద్రాపురం మండలం రాయలచెరువులో శుక్రవారం ఓ మృతదేహం వెలుగు చూసిన విషయం తెలిసిందే. మృతుడు తిరుపతి కొర్లగుంటలోని మారుతీనగర్‌కు చెందిన భాస్కర్(45)గా గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలతో రాయలచెరువులో దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.