సామాజిక సేవకురాలు మృతి
కృష్ణా: ఘంటసాల(M)చినకళ్లేపల్లికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక సేవకురాలు గీతామాత గుత్తికొండ కోకిలాంబ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. వైజ్ మెన్ క్లబ్ డైరెక్టర్‌గా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మండల మాజీ కార్యదర్శిగా సేవలందించారు. బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన సేవలు చిరస్మరణీయం. ఆమె కోరిక మేరకు భౌతికకాయాన్ని చిన అవుటుపల్లిలోని ఆసుపత్రికి అప్పగించారు.