రేషన్ బియ్యంలో పురుగులు

RR: ఇబ్రహీంపట్నం మండలం రామ్ దాస్ పల్లి, మలిశెట్టిగూడ, చింతపల్లి గూడలో మూడు నెలల రేషన్ సన్న బియ్యంలో మొత్తం పురుగులే ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. పురుగులతో కూడిన బియ్యాన్ని తినడం ద్వారా వాంతులు విరేచనాలు అవుతున్నాయని వీటిని తినడం మావల్ల కాదని అంటున్నారు. బియ్యాన్ని తిరిగి రేషన్ షాపు వాళ్లు తీసుకుని మంచి బియ్యాన్ని పంపిణీ చేయాలని అన్నారు.