వాహనదారులకు ఎస్సై సూచనలు

వాహనదారులకు ఎస్సై సూచనలు

NLR: హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని ఎస్సై రామక్రిష్ణ వాహనదారులకు సూచించారు. బుధవారం కోటనందూరు పోలీస్ స్టేషన్ వద్ద హెల్మెట్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే హెల్మెట్ తలకు రక్షణగా నిలుస్తుందన్నారు. వాహనం నడిపేటప్పుడు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆయన అన్నారు.