మద్యం కేసు నిందితుడి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు
AP: మద్యం కేసు నిందితుడు రోనక్ దాఖలు చేసిన పిటిషన్‌పై జైలు అధికారులు ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించాలని కోరుతూ రోనక్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి వ్యతిరేకంగా జైలు అధికారులు తమ కౌంటర్‌ను కోర్టులో సమర్పించారు. తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.