హైకోర్టు తీర్పు అమలు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

MDK: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని SGTU రాష్ట్రశాఖ డిమాండ్ చేసింది. ఆదివారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరాలని వినతి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.