రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు
ఏలూరు జిల్లా టీడీపీ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తుంది. జాతీయ, రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి ఆరుగురికి చోటు దక్కింది. జాతీయ ఉపాధ్యక్షుడిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా దాసరి శేషు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా బొమ్మాజీ అనిల్, వీరమల్లు నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శులుగా కొండపల్లి రవి, పెనుబోయిన మహేష్ ఎన్నికయ్యారు.