బాధితురాలికి నిత్యవసర సరుకులు అందజేసిన తహసీల్దార్

బాధితురాలికి నిత్యవసర సరుకులు అందజేసిన తహసీల్దార్

BDK: మణుగూరు మండలం గట్టు మల్లారం గ్రామంలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా గౌతమి ఇళ్లు శనివారం కూలిపోయింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు ఇంటిని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ నరేష్ బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. జరిగిన ఘటనని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.