VIDEO: 'అటవీ అమరుల త్యాగాలు చిరస్మరణీయం'

KMM: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సత్తుపల్లిలో అటవీ అధికారులు, సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా అటవీశాఖ సిబ్బంది పనిచేయాలని FDO వి.మంజుల తెలిపారు. అడవుల సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.