VIDEO: ఫ్రెండ్స్‌ని ఆటపట్టించిన హిట్ మ్యాన్
స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తన స్నేహితులతో సరదాగా గడిపిన ఓ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. రోహిత్‌ను ఆటోగ్రాఫ్ అడగడానికి ఒక స్నేహితుడు 'షాక్ పెన్ను' ఉపయోగించాడు. అయితే, ఆ పెన్ను గురించి తనకు బాగా తెలుసని చెప్పిన రోహిత్, అది ఎలా పనిచేస్తుందో చూపిస్తానంటూ దాన్ని తీసుకున్నాడు. అనంతరం, ఆ పెన్నుతో సరదాగా తన ఇతర స్నేహితులను ఆటపట్టిస్తూ నవ్వులు పూయించాడు.