బస్సు షెల్టర్‌ను ప్రారంభించిన హిమాలయ గురువు
NTR: గంపలగూడెం గాంధీ సెంటర్లో నూతనంగా దాతల సహకారంతో ఏర్పాటైన బస్సు షెల్టర్‌ను తోటమూలకు చెందిన హిమాలయ గురువు సరస్వతి మహారాజ్ దేవానంద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రయాణికులకు ఇదొక వరమని దీనిని పరిశుభ్రంగా వినియోగించుకోవాలని సూచించారు.