అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: MLA మహమ్మద్ షాజహాన్ బాషా ఇవాళ మున్సిపల్ నిధులతో మదనపల్లెలోని SBI కాలనీలో మురుగునీటి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాంనగర్ పార్కులో సిమెంట్ రోడ్డు, బాపూజీ పార్కులో పిల్లల ఆట వస్తువులు, కాంపౌండ్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.