నేడు నుంచి నామినేషన్లు ప్రారంభం
MLG: జిల్లాలో 3వ విడతగా జరుగుతున్న పంచాయతీ మరియు వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ నేడు ప్రారంభమైంది. ఈ మేరకు అభ్యర్థుల నుంచీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. వెంకటాపురం సర్పంచ్ స్థానాలు 18, వార్డు స్థానాలు 166, వాజేడు సర్పంచ్ స్థానాలు 17, వార్డు స్థానాలు 152, కన్నాయిగూడెం సర్పంచ్ స్థానాలు 11, వార్డు స్థానాలు 90 స్థానాలకు ఈ నెల 17 ఎన్నిక జరగనుంది.