మండపేటలో అత్యల్ప వర్షపాతం నమోదు
కోనసీమ: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఉప్పలగుప్తం మండలంలో అత్యధికంగా 93.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మండపేట మండలంలో అత్యల్పంగా 13.2 మి.మీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 37.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.